నందా ఇంటికి దారేది? – ఓ అందమైన అనుభవం

మనిషి ఎన్ని టెక్నాలజీలు వాడినా, చివరకు సేద తీరేది… తీరగలిగేది  ప్రకృతి వొడిలోనే.. ఎన్ని పట్నాలు తిరిగినా సాంత్వన పొందేది పల్లె పరిష్వంగంలోనే.

ఈ మధ్యన మా ఊరికెళ్ళినపుడు , ఎందుకో నా చిన్న నాటి మిత్రుడు నందా వాళ్ళ ఇంటికి వెళ్ళాలనిపించింది. వాడు వుండేది బెంగళూరు అయినా , పేరెంట్స్ వుండేది ఐరాల దగ్గర ఉన్న ఓ చిన్న గ్రామం లో.  వాళ్ళ కి నేనంటే ప్రత్యేక అబిమానం.. అందుకే … అనుకున్నదే తడవు, ఓ చిన్న బ్యాగ్ వేసుకుని పట్నం నుండి బయల్దేరాను. కాణి పాకం దాటాక ఐరాల కి ముందు వచ్చే సంత గేటు దగ్గర దిగాలి. అక్కడ నుండి , ఓ మూడు కిలో మీటర్లు తూర్పు వైపు వెళ్తే వచ్చేదే నందా వాళ్ళ వూరు. సంత గేటు వరకూ బస్సులో వెళ్ళాను.. అక్కడ దిగాక తెలిసింది, బస్సులు ఆ వూరికి వుండవని. ఎందుకో  పట్నం లో కలిగే కంగారు కలగలేదు బస్సు లేదనే సరికి. ఏముంది నడిచేద్దాం అనుకుని, దగ్గరలో ఉన్న ఓ టీ కొట్టు దగ్గర టీ తాగడం కోసం ఆగాను. టీ కొట్టు యజమానిని అడిగాను ఆ వూరికి ఏవైనా ఆటోలు వెళ్తాయా అని. లేదని చెప్పి, దూరంగా నిలబడి ఉన్న ఓ ట్రాక్టరు చూపించి, ” అతడిని అడగండి.. ఆ వూరికే వెళ్తున్నాడు..” అని చెప్పాడు..

ట్రాక్టరు డ్రైవ్ చేస్తున్న అతడిని అడిగే సరికి “ఎవరింటికి” అని అడిగాడు. నేను చెప్పే సరికి.. “ఓ వాళ్ళ ఇంటికా… మా పక్క ఇల్లే.. రండి తీసుకెళ్తాను” అన్నాడు. ఇంకేముంది, ట్రాక్టరు వెనక వైపు కూర్చున్నా జాగర్తగా … ట్రాక్టరు వెళ్తూ వుంటే చుట్టూ పచ్చటి పొలాలు… దూరంగా కనిపిస్తున్న కొండలు.. స్వచ్చమైన మట్టి వాసన.. అక్కడక్కడా ఇళ్ళు… ఇంటి ముందు కబుర్లు చెప్పుకుంటున్న చుట్టల రాయుళ్ళు, హాయిగా ఆడుకుంటున్న చిన్న పిల్లలు… ఇలా వీటన్నిటినీ చూస్తూ ఉండిపోయాను.. నిజం చెప్పాలంటే వాళ్ళు అనుభవిస్తున్న క్వాలిటీ అఫ్ లైఫ్ ని చూసి ఈర్ష్య చెందాను..

ఇలా అనుకుంటుంటూనే, నందా వాళ్ళ వూరోచ్చేసింది .. ఇంట్లోకి వెళ్తూనే ఆప్యాయంగా పలకరించారు నంద పేరెంట్స్.. వాళ్ళ ఇల్లు నాకు బాగా ఇష్టం. ఇల్లు ఆవరణ సుమారుగా 150 అడుగులు పొడవు, 50 అడుగులు వెడల్పు వుంటుంది. అందులో ఇల్లు, ముందు ధాన్యం ఆరబోయడానికి shaded open  area .. దాని ముందు గార్డెన్.. ఇంటి వెనుక కొబ్బరి చెట్లు, పూల మొక్కలు, కూరగాయల మొక్కలు.. అంత విశాల ఆవరణ చూస్తూనే “ఒరే నందా.. బెంగళూరులో ఏముందిరా.. అసలైన స్వర్గం ఇదేరా..” అనుకున్నా..

చాల కాలం తర్వాత కలిశాను కదా… అందుకే చాల సేపు కబుర్లు నడిచాయి.. నందా వాళ్ళ అమ్మ, నా టేస్ట్ తెలుసు కాబట్టి నాకిష్టమైన ఎల్లో రైస్, హొలిగ, పప్పు చేసారు  .. ప్రశాంతమైన వాతా వరణం, చీకట్లు ముసురుకున్న వేళ, దూరాన వినపడుతున్న ఆల మంద సవ్వడులు, నాణ్యమైన నిశ్శబ్దం ఓ perfect  evening కి నాందీ ప్రస్తావన పలికాయి. ఆ ambience లో   వారి ఆతిధ్యం స్వీకరించే సరికి, ఏదో తెలియని ఆనందం, ఉపశమనం, ఓదార్పు.. . It  was  a  perfect  stress  busting  experience

అలాంటి వాతావరణం లో ఆ రాత్రి గాఢమైన నిద్ర పట్టేసింది. పొద్దున్నే లేసి , కాలకృత్యాలు ముగించుకుని వారి నుండి సెలవు తీసుకుని బయల్దేరుతుంటే అనిపించింది, ఇంకో జన్మంటూ వుంటే ఇలాంటి వూళ్ళో పుట్టాలని.. పట్నాలకు దూరంగా, పతనాలకు దూరంగా..

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

8 Responses to నందా ఇంటికి దారేది? – ఓ అందమైన అనుభవం

 1. tejasswi says:

  గురువుగారూ, నమస్కారం.

  మీరు బ్లాగ్ రాయటంవలన మన ఆలోచనలలో కలిగే మార్పుపై ఒక పోస్ట్ రాశారుకదా! ఈ మధ్య అది ఎందుకో గుర్తొచ్చి చదవాలని అనిపించింది. దాని లింక్ ఇవ్వగలరా.

 2. tejasswi says:

  Yes! ఇదేనండి…నేనడిగింది. శ్రమతీసుకుని ఈ లింక్ ఇచ్చినందుకు కృతజ్ఞతలండి.

  మీరు ఈ పోస్ట్ లో చెప్పిన johari window technique గురించి ఇంతకుముందు వినలేదు. దీనిగురించి మరింత విపులంగా తెలుసుకుందామనే ఈ లింక్ అడిగాను.

  మరోసారి థ్యాంక్స్.

 3. Naresh says:

  హాయ్

  మీరు నాకు పరిచయం లేకున్నను, ఒక స్నేహితుడు లింక్ వాళ్ళ మీ బ్లాగ్ చూడడం జరిగింది .
  అన్ని టపాలు చాలా బాగున్నాయి.

  BTW, మాది మీరు చెప్పిన సంతగేటు కు 1 కి. మీ [పడమరలో]లో ఉన్న దిగువ కామినాయని పల్లె.

  నిజమండి, పల్లెటూర్లు చాలా బాగుంటాయి[ మీరు వర్షాకాలం లో వచ్చారు కదా, పైగా అది చెనిగి చెట్లు పెరికే కాలం, చాలా అందంగా ఉంటుంది]

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s