తను ఎప్పటికీ చిరంజీవే

గత నెల ప్రసన్న తో మా వూళ్ళో గాంధి రోడ్ లో వేళ్తున్నాను. అక్కడే పోలీసు గ్రౌండ్ ఉంది. ఎప్పటి నుంచో పరిచయమున్న ప్రదేశం కదా… ఆ ground కేసి చూస్తున్నాను . అక్కడ పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. ఓ పొడుగైన బలిష్టంగా వున్న అబ్బాయి బంతి విసురుతున్నాడు. తెల్లటి షర్టు, ఖాకి ప్యాంటు వేసుకున్నాడు మిగతా స్కూలు పిల్లలేమో ఖాకి నిక్కరు వేసుకున్నారు, తెల్లటి షర్టు కామన్ అందరికీ, ఓ బక్క పలచటి అబ్బాయి బ్యాటింగ్ చేస్తున్నాడు. బంతి flight చేశాడేమో.. ఆ సన్నటి అబ్బాయి ముందుకి వంగి లెగ్ సైడ్ ఫ్లిక్ చేసాడు. బంతి boundary దాటింది. బంతి వేసిన అబ్బాయి మెచ్చుకోలుగా చూస్తూ “well played ramakrishna” అన్నాడు, తన బౌలింగ్ లో బాగా ఆడిన అబ్బాయిని చూసి అసూయ చెందక పోగా పైపెచ్చు అభినందించిన అతడి క్రీడా స్ఫూర్తిని చూసి బ్యాటింగ్ చేసిన అబ్బాయి మనసులో మెచ్చుకున్నాడు.

ఆ బౌలర్ నాతో పాటు B.Z. High School లో (1980-81 batch) పదవ క్లాసు చదువుకున్న N.R. శ్రీధర్. తను చదువులోనే కాదు ఆటల్లోనూ చురుకు గా ఉండేవాడు. నేను వూరు విడిచాక చాల తక్కువ సార్లు కనపడేవాడు. బహుశా ఇరవై సంవత్సరాలు పైనే అయివుంటుంది తనని చూసి. కాని తన ఫోటోని Last December లో పత్రికలలో ముందు పేజీలో చూసి షాక్ అయ్యాను అడవి దొంగల చేతిలో వీరుడుగా పోరాడి మరణించిన అటవీ అధికారి శ్రీధర్ తనే అని తెలిసి. ఎంతో సన్నిహితంగా తను మెలిగిన నా స్కూలు రోజులు గుర్తొచ్చాయి. తను ఎంత మంచి  Sincere ఆఫీసరో పత్రికలలో రాయటం చూసి, తనకి నేను క్లాస్ మేట్  అయినందుకు గర్వించాను.

ఎంతోమంది రోజూ చస్తూ బ్రతుకుతుంటారు. కాని శ్రీధర్ మరణిం చి ఎప్పటికీ బ్రతికే వున్నాడు. ఎంతో భవిష్యత్తు, ఇంటి బాధ్యతలు ఉండి ఇంత చిన్న వయసులో తిరిగి రాని తీరాలకి వెళ్ళిపోయా డన్న బాధ మాత్రం గుండెల్లో కలియతిరుగుతోంది… తనకేమి ఇవ్వగలను ఈ కన్నీటి నీరాజనం తప్ప.

తన గుర్తుగా మా పదవ తరగతి గ్రూప్ ఫోటో పొందు పరుస్తున్నాను. ఫోటోలో శ్రీధర్ పై నుండి మూడవ వరుసలో ఎడమ వైపు నుండి తొమ్మిదో వ్యక్తి.. తను గుర్తున్న మిత్రులకి తన గురించి ఈ విషయం పంచుకోవాలన్న తపనతో ఈ టపా రాస్తున్నాను

tenth photo

 

 

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

3 Responses to తను ఎప్పటికీ చిరంజీవే

 1. Krishna Palakollu says:

  salute

 2. P. KALAIVANI says:

  HAI FRIENDS HOW R U ALL? WHY U R NOT GOING TO RESPOND FOR GETTOGETHER PROGRAM?
  WHAT HAPPENED TO ALL? R U NOT FEELING GOOD TO MEET OUR FRIENDS AND TEACHERS? WHEN WE
  THINK ABOUT THE PAST, THERE IS LOT OF DIFFERENCE. THAT AFFECTION HAS VANISHED
  AND DON’T TRY TO CONVINCE AMONG URSELF THAT ALL R BUSY WITH THEIR WORK.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s