మా స్కూలు మిత్రుల కోసం

మార్పు మంచిదా కాదా, అనివార్యమా , అహ్వానించదగ్గ పరిణామమా, జీవన క్రమంలో ఓ భాగమా… ఇలా ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ పోతే, అన్నింటికీ చెప్పగల ఒకే సమాధానం

మార్పు సహజమే 

(ఏదో ad లో మరక మంచిదె అన్నట్లుగా)

 ఈ ఉపో ధ్ఘా తం లేని ఉపన్యాసం దేనికంటె … మా స్కూలు మిత్రులు 2009 నుండి ప్రతి సంవత్సరం మూడు సార్లు కలిసినా 2011 నుండి మళ్ళీ కలవలేక పొయాము ఇంతవరకూ . గత సంవత్సరమైతె , మా వూళ్లోకలవటానికి తేది, వేదిక ఖరారు చేసిన తరవాత కూడా కలవలేకపోయాము.. చివరి నిమిషం లో అందరికీ ఏవో పనులు ముంచుకు రావటం వలన కుదరలేదు. గత డిసెంబర్ లో విదేశాల్లో ఉన్న బాబు, విజయ కృష్ణ వస్తున్నారని తెలిసి gettogether కి ప్రయత్నించినా కలవటానికి కుదర్లేదు.

మధ్య వయస్సు అనేది most demanding phase అని నా అభిప్రాయం. పిల్లలందరూ ఎంసెట్లు, కోచింగులు, hostels లో పంపటాలు , కౌన్సిలింగులూ, పేరిగే ఇంటి బాధ్యతలు, ఉద్యోగ రీత్యా పేరిగే commitments, ఇవేవీ వేచివుండలేని ప్రాధమ్యాలు. వీటి మధ్య మనకంటూ సమయాన్ని వేతుక్కోవటం అందరికీ కష్ట సాధ్యమయ్యింది. అందువల్లె ఈ విరామం. మనందరి అత్మీయతలు, అనుబంధాలు ఇప్పటికీ అలానె ఉన్నాయి. ఇప్పటికీ అందరూ మన చిన్న నాటి జ్ఞాప కాలలో సాంత్వన పొందుతున్నారు. “చంద్రుడు కనపడలేదని వెన్నెల వేరె చోటికి వెళ్లలేదు”

 ఈ సంవత్సరం, అందరం కలుద్దాం తప్పకుండా . అందరూ మే నెలలో కాని జూన్ లో కాని కలుద్దాం.

 మన classmate, మన మిత్రులందరినీ ఒక వేదిక పై ముప్పై ఏ ళ్ల తరవాత ఒక వేదిక పై  ని(క)లిపిన అత్మీయురాలు కలైవాణి పంపిన సందేశానికి స్పందనే ఈ టపా .

మన మిత్రులందరూ ఈ టపా పై అభిప్రాయాలు పంచుకోగల రని మనవి

Advertisements
This entry was posted in నాటి స్మృతి సౌరభాలు. Bookmark the permalink.

2 Responses to మా స్కూలు మిత్రుల కోసం

  1. Himabindu says:

    if time permits i will join

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s