బాపట్ల స్టేషన్ ఒకటో నంబరు ప్లాట్ ఫారం బెంచి….

రైల్లో వెళుతుంటే ఆ వూరి స్టేషన్ వచ్చిన ప్రతి సారీ  అప్రయత్నంగా ఒకటో నంబరు ప్లాట్ ఫారం పై ఉండే ఆ బెంచీ మీదే మరలుతాయి అతడి కళ్ళు ….

కాలేజీ తొలి రోజుల్లో చంద్రకళ పార్కుకొచ్చి పక్కనున్న   స్టేషన్లో ఆ బెంచీ పై కూర్చుని గమనించిన సూర్యాస్తమయాలు, వచ్చి పోతున్న రైళ్లు

కాలేజీ సెలవులప్పుడు ఫ్రెండ్స్ ని వూరికి సాగనంపడానికి వచ్చి ఆ బెంచి పై కూర్చుని పరాచికాలాడిన క్షణాాలు, దోబూచులాడిన నవ్వులు

పరీక్షల రోజుల్లో , అర్ధ రాత్రి హాస్టల్ నుండి స్టేషన్ కొచ్చి ఆ బెంచి పై కూర్చుని టీ తాగుతూ మిత్రులతో చర్చించిన చదువుల సంగతులు

వూళ్ల నుండి వచ్చే ఆత్మీయులను తీసుకు వెళ్ళటానికి ఆ బెంచి పై కూర్చుని ఎదురు చూచిన క్షణాలు, ఉద్వేగాలు, ఉద్విగ్నతలు

చదువులు పూర్తై అందరూ భిన్న గమ్యాలకు వెళ్తుంటే, ఆ బెంచి పై కూర్చుని మౌనమైన హృదయాలు, భారమైన భావాలు 

…………………… అన్నీ గుర్తుకొస్తుంటే, మళ్ళీ నా వొడిలో సేద తీరేది ఎప్పుడు మిత్రమా అని అడుగుతున్న ఆ బెంచి వైపు అతడు బేలగా చూస్తుంటే

రైలు భారంగా ఆ స్టేషన్ దాటి కదిలిపోతూంటుంది ఇవేవి తనకు పట్టనట్టుగా.. ఇలాంటివి తనకు మామూలే అన్నట్టుగా..

 

Advertisements
This entry was posted in సొంత కవిత్వం. Bookmark the permalink.

2 Responses to బాపట్ల స్టేషన్ ఒకటో నంబరు ప్లాట్ ఫారం బెంచి….

  1. vasanthwriter says:

    Naku mee blog ante chala istam andi…Right from the title. Chala nostalgic ga anipistundi. Especially ee post nenu chala sarlu chadivanu. Na college and school days gurtostai…Mee anubhavalani inka rayalani korukuntunnanu

    Vasanth

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s