The Savior – ఓ అసాధారణ చిత్రం

ఓ కథను చిత్రం గా మలచటం సహజం కాని ఓ చిత్రాన్ని కథ గా రాస్తే ఇంకా  బాగుండేది అనిపిస్తే మటుకు ఆ చిత్రంలో ఏదో విశేషమున్నట్లే. సరిగ్గా అలాంటి భావనే కలిగింది “The Savior” అనే ఆంగ్ల చిత్రాన్ని చూసాక. యాదార్ఘ ఘటనల ఆధారంగా, బోస్నియా లో చెలరేగిన ఘర్ష ణ ల నేపధ్యం లో తీసిన ఈ చిత్రం 1998 లో విడుదలైందట. కాకతాళియం గా ఈ చిత్రాన్ని ఈ మధ్య చూసాను. చూసాక అనిపించింది ఎంత మంచి చిత్రాన్ని ఇన్నాళ్లు మిస్ అయ్యానో అని. 

ఓ అమెరికన్ అధికారి (Dennis Quaid ) కుటుంబం తీవ్ర వాదుల దాడిలో చనిపోతారు. ఆవేశం లో అతడు ఓ మత వర్గానికి చెందిన వారిని విచక్షణా రహితంగా షూట్ చేస్తాడు. చేసిన తప్పు ని దిద్దుకోవటం కోసం తన పేరు, ఉనికి మార్చుకుని ఓ ప్రత్యేక సైన్యం లో చేరి బోస్నియా సైన్యానికి పని చేయటానికి వెళ్తాడు. అక్కడ జరుగుతున్న హింస, అమానవీయ చర్యలు చూసి చలించిపోతాడు. ఆ నేపధ్యం లో ఎన్నో excesses కి గురై అవాంచిత గర్భంతో deep shock లో వున్నఓ మహిళ ని ఇంటికి చేర్చటానికి పూనుకుంటాడు. దారిలో తనపై జరిగే దాడిని ఎదిరించి, ఆమెకి తనే పురుడు పోస్తాడు. తీవ్ర నైరాశ్యం తో వున్న ఆమెని ఆదరించి వెన్నంటి ఇంటికి వెళ్తాడు . అవమాన భారంతో ఆమె కుటుంబం తనని అతడినే తీసుకెళ్ళమని చెపుతారు. ఆమెని UN safe zone కి తీసుకెళ్లాలని బిడ్డతో పాటు బయల్దేరుతాడు. అంత వరకూ బిడ్డని కాదనుకున్న ఆమె అతడితో ప్రయాణిస్తున్న క్రమంలో ఓ పరిపూర్ణమైన తల్లిగా మారుతుంది. చివరికి ఆ తల్లి బిడ్డల్ని గమ్య స్థానానికి చేర్చాడా లేడా అన్నది చిత్ర సారాంశం. ఈ చిత్రం ముగిసే తీరు మాత్రం హృదయాన్ని కదిలించటం ఖాయం

మనిషి ప్రాణాలకి ఇతరులు ఇచ్చే విలువ ఎంత దయనీయంగా వుంటుందో ఇందులో చూడొచ్చు. హింస, ఘర్షణల నేపధ్యం లో కేవలం సాటి మనిషి అన్న అంశం తప్ప ఇంకే విషయమూ common లేని ఇద్దరు పెద్ద వాళ్ళు, ఓ పసి కందు మధ్య ఏర్పడే మానవీయ బంధాలు కళ్ళు చెమర్చే విధంగా తీసారు. మానవత్వం కన్నా మించిన దేది లేదు అని అంతర్లీనంగా ప్రతి సన్నివేశం లోనూ చెపుతుందీ చిత్రం. కొన్ని సంఘటనలను యదార్థం గా జరిగినట్టు చూపించే ప్రక్రియ లో ( ఓ ఉంగరం కోసం ఓ మహిళా చేతి వేలుని నరకటం , ప్రయాణీకులని చంపటం) షాక్ ఎక్కువగా వుంటుంది కాని చిత్రం లో ఎక్కడా అసభ్యతకి తావు ఇవ్వలేదు

మాటలు కొన్నే అయినా మనుషుల మధ్య జరిగే సంఘర్షణని ఓ ప్రేక్షకునిగా మనల్నే ఫీల్ అయ్యేలాగ తీసారీ చిత్రాన్ని. సహజత్వం కోసం చిత్రంలో చూపించే ప్రాంతానికి చెందిన నటులనే ఎంపిక చేసారు. మీరు ఈ చిత్రం చూడకుంటే మాత్రం ఓ మంచి చిత్రం మిస్ అయ్యినట్టే.

Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

One Response to The Savior – ఓ అసాధారణ చిత్రం

  1. kalaivani says:

    we missed to see the film. After reading the comment we are eager to see.
    WISHING OUR FRIENDS A HAPPY AND PROSPEROUS DIWALI. HAVE A BLAST.
    BY KALAIVANI.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s