సంజీవ్ కుమార్ … a tribute

కొంత మంది అరుదైన వ్యక్తులు కేవలం జీవించి వెళ్ళటానికి భూమి పైకి రారు .. ఇక్కడ విహరించటానికి వచ్చి కొన్ని కానుకలు ఇచ్చి వెళతారు .. ఆ కానుకలు జ్ఞాపకాలై పరిమళాన్ని వెదజల్లుతూనే వుంటాయి ఎప్పటికీ తనని గుర్తుకి తెస్తూ … అలాంటి విలక్షణ వ్యక్తే నటుడు సంజీవ్ కుమార్ .

కేవలం 47 ఏళ్ళు జీవించినా, తను మరణించి దాదాపు ముప్పై ఏళ్ళు కావస్తున్నా, ఇప్పటికి తన నటించిన సినిమాలు – ‘మౌసం’, ‘ఆంధీ’ , ‘షోలే’ , ‘అంగూర్’, ‘కోషిష్’ ఇలా ఎన్నో …..అన్నీ అందర్నీ అలరించే చిత్రాలే, అంతర్లీనంగా స్పృశించే చిత్రాలే … అన్నీ మరువ లేనివే . పిన్న వయసులో మరణించినా, వెండి తెర పై రెట్టింపు వయసు పాత్రల్లో కూడా జీవించాడు. అతడు పోషించిన పాత్రలలో ఉన్నంత వైవిధ్యం ఏ ఇతర నటుల పాత్రలలో లేదంటే అతిశయోక్తి కాదేమో .. ‘అంగూర్’, ‘హీరో’ లలో హాస్యం పండించిన వ్యక్తి, ‘షోలే’ లోని ప్రతీకారం తో రగిలిపోయే ఓ వృద్ధుడు, ప్రేమ కోసం నిన్నటి జ్ఞాపకాలలో విహరిస్తూ పరితపించే ‘మౌసం’ లోని వ్యక్తి వొకరు అంటే నమ్మటం కష్టమే.. అంతటి వైవిధ్యం సంజీవ్ కుమార్ కి మాత్రమే సొంతం.

He always looked like a man in hurry… eager to give in a short life span everything he can do best… to act and entertain..

Sanjeev kumar… a man par excellence. saluting him on the eve of his death anniversary…. I remain

Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

2 Responses to సంజీవ్ కుమార్ … a tribute

  1. very apt tribute.. for a great actor!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s