మిట్టూరు, కట్టమంచి ఎక్కడ వున్నాయంటే ….

నామిని సుబ్రహ్మణ్యం (సవరించిన జిలేబి గారికి కృతజ్ఞతలతో ) గారు రాసిన “మిట్టూరోడి కథలు” పుణ్యమా అని చిత్తూరు యాస తెలియటంతో పాటు, సాహిత్యాభిలాష వున్న అందరికీ మిట్టూర్ అన్న పదం సుపరిచతమైంది . కాని ఆ ప్రదేశం (ఆర్ కె నారాయణ్ గారి మాల్గుడి లాగ) ఎక్కడ ఉంది అనేది చాలా మంది కి తెలియక పోవచ్చు.
మిట్టూరు అనేది చిత్తూర్ పట్టణం నడి బొడ్డులో వుండే ఓ వీధి పేరు . ప్రతాప్ టాకీసు పక్కన ఉన్న పార్కు దగ్గర నుండి తూర్పు వైపుగా వున్న రిజర్వు ఫారెస్ట్ దాకా విస్తరించి వుంటుందీ వీధి . అప్పట్లో ఇళ్ళు తక్కువ ఉండేవి మిగతా అంతా పొలాలతో పచ్చగా వుండేదీ ప్ర్రాంతం. కాని ఇప్పుడు దాదాపుగా అన్ని చోట్లా ఇళ్ళు వచ్చేశాయి.
ఈ వీధి నుండే మా టీచర్ వసంత మేడం అప్పట్లో నడుచుకుంటూ (సుమారుగా 2 కిలో మీటర్లు) మా స్కూలుకి వచ్చేవారు మేడం. ఈ వీధిలో వుండే ద్వారకా (ఇప్పుడు అలంకార్) హోటల్ వూరిలో వున్న మంచి హోటల్స్ లో ఒకటి.

అలాగే ఆంధ్ర విశ్వ విద్యాలయం తొలి (వ్యవస్థాపక) ఉప కులపతి కట్టమంచి రామలింగా రెడ్డి గారి పేరు అందరికీ సుపరిచతమే. వారి ఇంటి పేరు కట్టమంచి చిత్తూర్ లోని ఇంకో వీధి పేరు . తిరుపతి వెళ్ళే దారి లో చిత్తూరు పొలిమేరల లో ఉంటుందీ ప్రాంతం. తను ఇక్కడే పెరిగారు కాబట్టి ఆ ఇంటి పేరు వారి పూర్వీకులకు వచ్చి వుంటుంది.

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

8 Responses to మిట్టూరు, కట్టమంచి ఎక్కడ వున్నాయంటే ….

 1. Zilebi says:

  గిరింపేట కతల్ వారు,

  సవరించ వలె ! – మిట్టూరోడి కథలు రచయిత నామిని సుబ్రహ్మణ్యం నాయుడు ,

  వారు రాసిన మిట్టూరు తిరుపతి మిట్టూరు అనుకుంటా ? !

  మీ చిత్తూరు మిట్టూరు పార్కు గురించి రాయలేదే మరి ?? ఉందా ఇంకా ??

  ఎండలు గాసే ఈ భూమండలం మీద ఇంత తిమురు బట్టిన రచయిత ఇంకొకరుంటా రా అంటా !! జేకే!!

  జిలేబి

  • mhsgreamspet says:

   సవరణకు థాంక్స్ అండి (నేనెందుకు అలా రాసానా అని ఆలోచిస్తే , మా స్కూలు రోజుల్లో నాయిని కృష్ణ మూర్తి గారు చౌడేపల్లి లో మా బడి , పాఠశాల అనే పత్రికలూ ప్రచురించే వారు స్టూడెంట్స్ కోసం … అలా మిస్టేక్ చెసాను… :-))
   తిరుపతి మిట్టూరు గురించి నాకు ఐడియా లేదు . ఇంతకీ మీరు ఉదహరించిన ఆ తిమురు పట్టిన రచయిత నేనే అంటారా …? హ్మ్ …. కానీయండి ..

 2. Zilebi says:

  నాయుడి గారి గురించి ఇంకొంచం ‘విలావరి’ గా !!

  http://pustakam.net/?p=3521

  చీర్స్
  జిలేబి

 3. Zilebi says:

  గిరింపేట కథల వారు,

  ఆ తిమురు బట్టిన రచయిత మీరు కాదండోయి ! అది నాయుడు వారికి జనాలు ఇచ్చిన ఆరుదైన కితాబు ! ఆ పుస్తకం డాట్ నెట్ సైట్ లో ఒక లింకులో వస్తుంది దాని కథా కమామీషు !!

  నెనర్లు సవరణ కి !

  చౌడేపల్లె వారి మా బడి పుస్తకాలు ఇంకా వస్తున్నాయా ??

  జిలేబి

  • mhsgreamspet says:

   🙂 ధన్య వాదాలండీ … చౌడే పల్లె ప్రచురణల గురించి ఇప్పుడు తెలియదండీ .. ఇప్పుడున్న కార్పోరేట్ విద్యా హోరు లో అది ఉందో లేదో
   …..

 4. Dr. S. Vijayakrishna says:

  Hi Ram,
  Mittoor in Namini’s books is a village near by Tirupati. It is Namini’s native place. He is our relative and our village is also near by Mittoor.
  Dr. Vijayakrishna

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s