The DNA of చిత్తూరు

చాల మందికి చిత్తూరు అనగానే తమిళ భాష ప్రభావితమైన తెలుగు మాట్లాడే ప్రాంతంగా స్ఫురణ కి వస్తుందే తప్ప ఆ ప్రాంత ఇతర విషయాలు అంతగా తెలియక పోవచ్చు .
తిరుపతి లాంటి ప్రాంతాలు పట్టణీకరణ వేగంగా చెందుతున్నా ఈ వూరు మాత్రం అలాగే ఉండిపోయింది మా పూర్వ జ్ఞాపకాలని పదిల పరుస్తూ. ఇప్పటికీ మా వూళ్ళో నడుస్తూ వుంటే ప్రతి ప్రాంతం లో ఆ ప్రాంతం తాలూకు ఎన్నో జ్ఞాపకాలు స్మృతి పథం లో మెదులుతాయి.
ఎన్నో షాపింగ్ మాల్స్ వచ్చి ఉండొచ్చు ……. కాని ఇప్పటికీ అక్కడ పాత కిరాణా కొట్లకే ప్రాధాన్యం
ఎన్నో రుణాలిచ్చే కంపనీలు వెలిసి ఉండొచ్చు ……… కాని ఇప్పటికీ అక్కడ పక్క ఇంటి వాడు వేసే చీటీల లోనే డబ్బు పొదుపు
ఎన్నో hi fi హోటల్స్ ఉండొచ్చు …. ఇప్పటికీ ‘రెండిడ్లీ ఒరు వడ with సాంబార్ అండ్ చెనిగ్గింజల చట్నీ’ పెట్టే చిన్న హోట ళ్లకే గిరాకీ
ఎన్నో కేఫ్ డే లు ఉండొచ్చు……. కాని బాయిలర్ బయట పెట్టి, వేడి నీళ్ళతో టీ తాగితేనే అక్కడ అందరికీ తృప్తి

అలాగని ఇక్కడి వారందరూ సామాన్యులని కాదు ఎందఱో గొప్పవ్యక్తులని అందించిన గడ్డ ఇది . చరిత్రలో ఎన్నో ఘటనలకి సాక్ష్యమైన భూమి ఇది

అప్పట్లో చాక్లెట్ అంటే న్యూట్రిన్….. న్యూట్రిన్ అంటే చిత్తూరు . ఎందుకంటే న్యూట్రిన్ ఫ్యాక్టరీ వుండేది ఇక్కడే … ఇంటి ముందు నించుని న్యూట్రిన్ ఫ్యాక్టరీ నుండి వెలువడే పొగ , దానితో పాటు వచ్చే కమ్మటి వాసన ని ఇంటి ముందు నించుని అఘ్రాణించిన ఆ రోజులు ఇప్పటికీ గుర్తే. అప్పట్లో చందమామ పత్రిక ప్రతి సంచిక లోనూ ఈ చాక్లెట్ యాడ్ ఉండేది.
వైద్య రంగం లో కార్పోరేట్ రంగానికి బాటలు ఏర్పరిచిన అపోలో ఆసుపత్రుల అధినేత డా ప్రతాప్ సి రెడ్డి సొంతూరు ఇక్కడికి దగ్గరలోని అరగొండ అనే చిన్న ఊరు.
పదవ తరగతి, ఏడవ తరగతి విద్యార్థులకు అప్పట్లో ప్రతి మాసం మా బడి , పా ఠ శాల అనే రెండు పత్రికలు వచ్చే వి . ఇవి వాడని విద్యార్థులు అప్పట్లో లేరంటే అతిశయోక్తి కాదేమో . రాష్ట్ర వ్యాప్తంగా ఇవి వాడుక లో ఉండేవి. వీటిని నాయిని కృష్ణ మూర్తి గారు మదన పల్లి దగ్గరున్న చౌడే పల్లి లో ప్రచురించేవారు అప్పట్లో.

బాలాజీ హేచరీస్ సుందర నాయుడు, అమరాన్ industries గల్లా కుటుంబం ఇక్కడి వారే

చరిత్ర లో కెళ్తే ….
తత్వ వేత్త జిడ్డు కృష్ణ మూర్తి పుట్టింది ఈ గడ్డ పైనే. మదన పల్లి దగ్గర వారు స్థాపించిన రిషీ వ్యాలీ స్కూల్ విశ్వ విఖ్యాతమే.
“మా తెలుగు తల్లికి మల్లె పూదండ ….. ” అనే మరపు రాని , అమర మధుర గీతాన్ని రాసిన శంకరం బాడి సుందరాచారి ఈ నేల బిడ్డే
రవీంద్ర నాథ్ టాగూర్ జాతీయ గీతానికి స్వర కల్పన చేసిన ప్రదేశం మదన పల్లి , అక్కడి BT (Besant Theosophical ) కాలేజి ఈ భూమిలోని అంతర్భాగమే
కళామ తల్లి ముద్దు బిడ్డ అనదగ్గ చిత్తూర్ నాగయ్య గారు వేసిన నాటకాలకు వేదిక ఐన “శ్రీ రామ విలాస సభ” (ఎన్నో సార్లు గొల్ల పూడి గారు కూడా ఈ వేదికని ప్రస్తావిస్తుంటారు) ఈ పట్టణం లో ఉన్నదే. (స్కూలు రోజుల్లో ఇక్కడ కెళ్లి చూసిన నాటకాలు, బహుమతి తీసుకున్న ఓ సందర్భమూ మరువలేని స్మృతి సౌరభాలు)
విద్య రంగం లో కట్టమంచి రామలింగా రెడ్డి, సాహితి రంగం లో మధురాంతకం రాజారామ్ , కలువ కొలను సదానంద, పులికంటి కృష్ణా రెడ్డి , వడ్డెర చండీ దాస్(as a professor at SVUniversity), నామిని సుబ్రహ్మణ్యం, మేర్లపాక మురళి … ఇలా ఎందరో ఈ నే ల తో అనుబంధమున్న వాళ్ళే

ఈ ప్రాంతానికి వైవిధ్యమూ వుంది
గుక్కెడు నీళ్ళ కోసం ఒక చోట కష్ట పడుతుంటే . తలకోన లాంటి జలపాతమూ ఇక్కడే వుండటం వైవిధ్యమే
వేసవి ప్రచండ తాపం చూపుతుంటే , పక్కనే చల్లటి వేసవి విడిది హార్సలీ కొండలు ఉండటమూ ఇంకో వైచిత్రే
ఇక్కడి వాళ్ళు ఎన్ టీ ఆర్ ని ఎంత ఇష్ట పడతారో ఎం జీ ఆర్ నీ అంతే ఆరాధిస్తారు. (మా వివేకానంద టాకీసు ఇప్పుడు లేదు కానీ … పదేళ్ళ క్రితం కూడా ఆ టాకీసు లో అడిమై పెణ్ , రిక్షా కారన్ లాంటి ఎం జీ ఆర్ సినిమాలు వేస్తూనే వుండే వారు)

ఇన్ని విశేషాలతో కూడుకున్న ఈ ప్రాంతం తో నాకున్న గుర్తుల్ని తవ్వుతుంటే అనిపిస్తుంటుంది
“ఈ నేలలో ఏదో మహత్తు ఉంది . The more I think about it, the more I fall in love with it.”

Advertisements
This entry was posted in ఇదండీ సంగతి. Bookmark the permalink.

4 Responses to The DNA of చిత్తూరు

  1. Himabindu says:

    “ఇన్ని విశేషాలతో కూడుకున్న ఈ ప్రాంతం తో నాకున్న గుర్తుల్ని తవ్వుతుంటే అనిపిస్తుంటుంది
    “ఈ నేలలో ఏదో మహత్తు ఉంది . The more I think about it, the more I fall in love with it.””TRUE!

  2. Naresh says:

    Meeru chala baga raastharandi….!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s