“కహాని”, “అనామిక” లలొ ఏది బాగుంది ?

ఎప్పుడూ వింటున్నా “కహాని” మంచి చిత్రమని… తెలుగులొ ఆ చిత్రం “అనామిక” గా వచ్చాక, రెండూ చూసాను.
మొదట “కహాని” గురించి

ఈ చిత్రం ఎలా చూసానంటే, చూసిన రెండు గంటలు ఎలా గడిచి పోయాయో తెలియలేదు. అంత gripping గా ఉంది చిత్రం. ప్రతి సన్నివేశానికి చిత్ర కథతో సంబంధముంది. విద్యా బాలన్ నటన అద్వితీయం. “అనామిక” లో నయనతార చిత్రంలో ఆద్యంతమూ grim గా ఉంటుంది. విద్య మాత్రం తనకి సహాయం చేసే  పొలీస్ ఆఫీసర్ తో అప్పుడప్పుడూ అల్లరిగా, dominating గా ఉంటుంది. హొటెల్ లో పరిచయమయ్యే   పిల్లవాడితొ affectionate గా, cheerful గా, తమాష పట్టిస్తూ ఉంటుంది. తప్పిపోయిన భర్త గుర్తొచ్చినప్పుడు బేల తనం కనపడుతూ వుంటుంది. “అనామిక” లొ మాత్రం నాయిక stress లో వుంటుంది. ఆ విధంగా చూస్తే  “కహాని” లొని నాయికకి నటన పరంగా ఎక్కువ వైవిధ్యముంది.

ఇక పోతే  “అనామిక” గురించి..

శేఖర్ కమ్ముల , యండమూరి ఈ కథని యధా తధంగా తీసుకోకుండా బాగా మార్చి తీసారు. హిందిలో film చూసిన వాళ్ళు ఇలాంటి సినిమాని ఇంకో రూపంలో చూడక పోవచ్చు ఎందుకంటే  ఇది thriller, suspense elements ప్రాధాన్యమైన చిత్రం కాబట్టి, ఇలాంటి చిత్రాన్ని మళ్ళీ చూడాలంటే కథలో  వైవిధ్యత చూపించాలి అందుకె కాబొలు, శేఖర్ కమ్ముల , యండమూరి కథని ఇంకో రూపంలో మలిచారు. “కహాని” లోలా కాకుండా , ఇందులొ నాయిక కి pregnancy వుండదు. అక్కడినుండే …. ఈ చిత్రం భిన్నంగా ఉండబోతుందని వాళ్ళిద్దరూ ముందే చెప్పేసారు. పొలీస్ స్టేషన్ కి మొదటి సారి వెళ్ళినప్పుడు “కహాని ” లో నాయిక తన భర్త ఫొటొ ఒకటే ఉందంటే, “అనామిక” లో ఎన్నొ ఫొటొ లు వున్నాయని చూపించటంతొనె అర్థమౌతుంది ఈ సినిమా” కహాని” తరహాలో  ఉంటుంది…. కాని “కహాని” కాదని.

“కహాని” కోల్ కత నగరాన్ని చూపిస్తే, “అనామిక” హైదరాబాద్ పాత బస్తీ నేపధ్యంలో సాగుతుంది. కొల్ కత metro rail, trams, అక్కడి భాష, బెంగాలి accent లో హింది ఉచ్చారణ ప్రతి పాత్ర చెప్పే  తీరు చాలా  perfect గా ఉంది “కహాని” లో. Besides the actual plot, the film captured the soul of Kolkata brilliantly.

రెండింటి పోలికలకొస్తే , “కహాని” చాల convincing గా అనిపించింది. ఇందులో clarity ఎక్కువ కనిపించింది. ప్రతి పాత్ర నీ మలిచిన తీరు బాగుంది.
నా వోటు “కహాని” కే …

 

Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s