The Bridges of Madison County – పరిచయం

జీవితం అంటే ప్రతి రోజూ లేవడం , దైనందిన పనులు చేసుకోవటం , నిద్రపోయి మళ్ళీ ఇంకో రోజు కోసం ఉసూరుమంటూ ఎదురు చూడటం కాదు … నాలుగు క్షణాలైనా మనం మనంగా జీవిస్తే చాలు ఆ జ్ఞాపకాలే మిగిలిన జీవితాన్ని అర్థవంతంగా బతకటానికి సరిపోతాయి.
రోజులు గడిచిపోతుంటాయి అంతా సవ్యంగా జరిగిపోతుందనిపిస్తుంది … అలాంటి సమయం లో ఓ మలుపు ఓ పరిచయం … ఓ క్షణం ఎదురౌతుంది … కోల్పోయిందేమిటో … కోల్పోతున్నదేమి టో తెలుస్తుంది … జీవితాన్ని ఇంకో కటకం లోంచి చూపిస్తుంది ..
హృదయాన్ని అనుసరిస్తూ గమ్యం తెలియని దారులను అనుసరించాలా , రాజీ పడుతూ పొదివి పట్టుకున్న ఆ కొన్ని విలువైన క్షణాలను నెమరు వేసుకుంటూ నిస్సారమైన నిస్తేజమైన బాధ్యతల చట్రంలో ఇమిడిపోవాలా అనే మీమాంస అప్పుడే మొదలౌతుంది… సంఘర్షణ మొదలౌతుంది. That is the time you have to decide to follow your heart or mind.
ఈ ఇతివృత్తాన్ని ఆధారం గా తీసిన చిత్రమే “The Bridges of Madison County”. 1995 లో విడుదలైన ఈ చిత్రాన్ని బహుశా ఎప్పుడూ చూసి ఉండక పోయి ఉందును . మిత్రులు వసంత్ గారు ఇచ్చిన వ్యాఖ్య ఆధారం గా ఇంత మంచి చిత్రాన్ని చూడగలిగాను వారికి ధన్యవాదాలు.

చిత్రం వివరాల్లోకి వెళ్తే …
ఓ నడి వయసు మహిళ (Meryl Streep ) సాధారణ గృహిణి గా జీవితాన్ని అతి సాధారణంగా గడిపేస్తూ ఉంటుంది. తన ఇద్దరు పిల్లలు భర్త తో పాటు పని మీద వేరే వూరికి ఓ నాలుగు రోజులు వెళ్తారు. 50 సంవత్సరాల ఓ wild life photographer (Clint Eastwood ) ఈ నాలుగు రోజుల్లో పరిచయమై అత్యంత అత్మీయుడైపోతాడు. అతడి సాంగత్యంలో తాను కోల్పోయిన ఆనందాలు, అనుభూతులూ పొందుతుంది. తనని తనే discover చేస్తుందీ నాలుగు రోజుల్లో. వారి బంధం ఎంత బలపడుతుందంటే  ఏ చికాకులూ లేని తన కుటుంబ జీవితాన్ని వదులుకుని తను అతడితో వెళ్లిపోయేంతగా . తనతో వెళ్ళిపోవాలని నిర్ణయించుకుని సర్దుకుంటుంది. అప్పుడు మొదలౌతుంది సంఘర్షణ … స్వార్థం చూసుకుని తనతో వెళ్ళటమా… తన బాధ్యతలైన పిల్లలూ భర్త తో ఉండి పోవటమా … ఆ ఊగిసలాటలో తన బాధ్యతే గెలుస్తుంది. వారి నాలుగు రోజుల సాంగత్యం తనని తన కలల్లోనే ఉండిపోయేలా చేసి తన శేష జీవితం గడిపేలా చేస్తుంది … తనలోనే దాచుకున్న ఈ రహస్యాన్ని తన పిల్లలకు తెలియ జెప్పాలని, అతడితో విహరించిన Madison bridge దగ్గర తన చితా భస్మాన్ని కలిపేలా పిల్లలని కోరుతూ తను రాసుకున్న diaries పిల్లలను చదివేలా చేస్తుంది. తల్లి రహస్య జ్ఞాపకాలను చదివిన పిల్లలు ఎలా స్పందించారో చిత్రం లో మధ్య మధ్యలో చూపిస్తూ కథనం నడుస్తుంది.

చిత్రం లోని ఆత్మని ఆవిష్కరించే ఒక్క statement (Again thanking vasanth for quoting)
The old dreams were good dreams; they didn’t work out but I’m glad I had them.
Meryl Streep , Clint Eastwood రెండు పాత్రలలో జీవించారంటే అతిశయోక్తి కాదు. స్పందించే హృదయముంటే ఈ చిత్రం చూసాక హృదయాంతరాళాల లో ఓ సన్నటి జడి మొదలై ఝరై కళ్ళను సునామీలా కప్పేయగలదు. A poignant movie to feel and watch..

 

Advertisements
This entry was posted in సినిమాలు-సాహిత్యం. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s