ఎట్టకేలకు మళ్ళీ కలిశాం

ఎన్నాళ్లకేన్నాళ్ళ కెన్నాళ్ళకు ..? 2011 నుండి ఊరిస్తూ దూరమైన ఆ మధుర క్షణాల్ని అందరం మళ్ళీ సొంతం చేసుకున్నాము. గత నాలుగేళ్ళుగా మా మిత్రులందరూ మళ్ళీ కలవాలని ఎంతో ప్రయత్నించినా వివిధ కారణాల వాళ్ళ కలవలేక పోయాము . ఒక సారి తేది స్థలము అన్నీ నిర్ణయించుకున్నా , అప్పట్లో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి వలన కలవలేక పోయాము. గత నెల 19 న చిత్తూర్ లో మా బాల్య మిత్రులందరం మళ్ళీ కలవ గలిగాము. ఈ సారి మా బృందం లోకి నాగేశ్వర్ రావు , శ్రీ రాములు (బెంగళూర్) , రవి కుమార్ (కాకినాడ) , చెంగల్ రెడ్డి (చిత్తూర్) కొత్తగా కలిసారు.
ఎప్పటి లాగే పాత మిత్రులందరూ ఎన్ని ఇబ్బందులున్నా 19 న రాగలిగారు. కాకినాడ నుండి రవి కాజాల్ని ప్రత్యేకంగా తెచ్చాడు.

మూడవ get together 2011 లో జరిగినప్పుడు అస్వస్థత కారణంగా రాలేక పోయిన గోపాల్ చాలా కాలం ఇంటి పట్టునే ఉండిపోయాడు. ఈ సారి మాత్రం అందరినీ కలవాలనే పట్టుదలతో ఎంత శ్రమ అయినా అందరితో గడిపాడు అంతే కాదు క్విజ్ లో అత్యుత్సాహం తో పాల్గొన్నాడు. చూడగానే తనని ఆత్మీయంగా కౌగ లించుకున్న సురేష్ (తను అందరినీ కలవటం కోసం నాసిక్ నుండి వచ్చాడు) … ఆ క్షణాలు బహుశా ఈ సారి ఫంక్షన్ లో best moments అని చెప్పొచ్చు

ఆ రోజు పొద్దున్న గురువులతో పాటు కాలం గడిపాము. మధ్యలో మా సూరి బావ అధ్వర్యంలో సన్మానం చేసాము. మధ్యానం భోజనం అయ్యాక క్విజ్ పోటీ పెట్టుకున్నాము వరైటీగా. క్విజ్ అంతా మా స్కూలు రోజుల జ్ఞాపకాలను గుర్తు తెచ్చేలా తయారు చేసి, మా మిత్ర బృందాలకు పోటీ నిర్వహించాం. అంటే ఎలా అనే కదూ మీ ప్రశ్న .. రౌండ్ 1 లో మా స్కూలు రోజుల్లో జరిగిన కొన్ని సంఘటనల  ఆధారం గా ప్రశ్నలు, రౌండ్ 2 లో అప్పట్లో ఏ థియేటర్ లో ఏ సినిమా ఆడింది… ఇలా 5 రౌండ్స్ చేసాము. అందరూ పోటా పోటీగా పాల్గొన్నారు.  ఈ ప్రక్రియలో అల్లరి , గొడవలు.. వాగ్వాదాలు.. అందరూ నిజంగా ఆ రోజుల్లో ఎలా ఉండే వాళ్ళమో అలా మారిపోయాము.

చివర్లో విజేతలకు హైదరాబాద్ కరాచి బిస్కట్స్ తో బహుమతి ప్రదానం .. అందుకు మూడు తరాల ప్రతినిధులుగా మా పీ టీ మాస్టర్, వాళ్ళ అమ్మాయి శశి, శశి వాళ్ళ అమ్మాయి జిజోల్ చేత బహుమతుల ప్రదానం … అంతా కన్నుల పండుగగా సాగింది
చివర్లో టీ బ్రేక్ … ఆ తరవాత భారంగా వీడ్కోలు.. ఓ జీవిత కాలానికి సరిపడే స్మృతుల్ని ప్రోది చేసుకుని నిష్క్రమణ
ఈ సారి కొన్ని అపశ్రుతులు దొర్లాయి.. అయినా అన్నిటికీ ఎదురొడ్డి మళ్ళీ అందరినీ కలిపిన మా మిత్రుల సంకల్ప బలానికి అభినందనలు చెప్పుకోవాల్సిందే.

IMG-20150920-WA0026

క్విజ్ లో విజేతలైన వారికి బహుమతి ప్రదానం  జిజోల్ (శశి వాళ్ళ అమ్మాయి), పీ టీ మాస్టర్ పుష్పరాజ్ సార్, రామకృష్ణ , శశి , సురేంద్ర, చెంగ, గోపాల్, లవ చిత్రంలో ఉన్నారు

క్విజ్ లో విజేతలైన వారికి బహుమతి ప్రదానం
జిజోల్ (శశి వాళ్ళ అమ్మాయి), పీ టీ మాస్టర్ పుష్పరాజ్ సార్, రామకృష్ణ , శశి , సురేంద్ర, చెంగ, గోపాల్, లవ చిత్రంలో ఉన్నారు

Advertisements
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

2 Responses to ఎట్టకేలకు మళ్ళీ కలిశాం

  1. himabindu says:

    hmm! mammalni invite cheyaledu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s