బహుశా … అందుకేనేమో

నా రెక్కలు చిన్నవౌతు న్నట్టు న్నాయి ….
బహుశా … అందుకేనేమో
ఇన్నాళ్లూ రెక్కల కింద దాగున్న ఓ పిల్ల
చిన్ని రెక్కల్ని విప్పుకుని
వినీలాకాశంలో  ఎగిరిపోతోంది

నా కంటి చూపు మందగించినట్టుంది..
బహుశా… అందుకేనేమో
ఎత్తున ఎగిరి పోతున్న ఆ పిల్ల
ఆర్తితో నిండిన నా కళ్ళకు
మసక మసకగా కనపడుతోంది

నా స్వర పేటిక బలహీన మయినట్టుంది …
బహుశా… అందుకేనేమో
వెనక్కి రమ్మని పిలవాలని ఉన్నా
డగ్గుత్తిక తో పూడుకు పోయిన నా స్వరం
తనని పిలవలేకపోతోంది

బహుశా… అందుకేనేమో.. అందుకేనేమో… అందుకేనేమో
వర్తమానపు ఈ పుటల పై నా కలం ఇక ఏ మాత్రం
కదలనంటోంది … కదలనంటోంది … కదలనంటోంది …

This entry was posted in Uncategorized. Bookmark the permalink.

2 Responses to బహుశా … అందుకేనేమో

  1. Hima bindu says:

    Hmm! Vellipoyindhaa..rekkalu vachaka pakshulu good vadalaka thappadhu

  2. The article is quite interesting& recollected the past memories
    .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s