అయినా … మనిషి మారలేదు ..

70 ల్లో మాట .. ఏవైనా చిరుతిళ్ళు తినాలంటే వీధి చివర ఇంట్లో చేసే కొబ్బరి బర్ఫీలు నిప్పట్లు తినేవాళ్ళం . లేదా సాయంత్రం తోపుడు బళ్ళలో స్వీట్స్ savories అమ్మే వారు .. గంట మోగిస్తూ .. ఆ గంట శబ్దం వింటే చాలు ఊరికే వాళ్ళం పది ఇరవై పైసలు చేతిలో పెట్టుకుని

1976 లో అనుకుంటా .. ఊరి మధ్యలో ఆర్కాట్ స్వీట్ స్టాల్ వెలిసింది .. ఎన్ని వెరైటీలో .. జాంగ్రీ నా favorite .. నెలకు అర కేజీ కోటా ఉండేది జీతం వచ్చిన రోజున .. ఆర్కాట్ స్వీట్స్ కోసం నెల అంతా వేచి వుండే వాడిని. ఆర్కాట్ స్వీట్ స్టాల్ వచ్చాక వీధి చివర మిఠాయి తోపుడు బళ్ళలో మిఠాయి మరుగున పడ్డాయి.

కాలక్రమంలో ఆర్కాట్ స్వీట్ స్టాల్ స్థానంలో పుల్లా రెడ్డి స్వీట్స్ , online లో ఆర్డర్ చేసి తెప్పించుకునే విధానం వచ్చేసింది .

ఒక సంస్కృతి పోయి ఇంకోటి వస్తూనే వుంది.. ఒక పద్దతి బదులు ఇంకోటి .. ఇలా నిరంతరం మార్పు వస్తూనే వుంది. కానీ ఒకటి మాత్రం స్థిరంగా ఉండి పోయింది .. అదే …. స్వీట్స్ అంటే మక్కువ. ఇప్పటికీ మనసులో ఓ సారి ఆ ఆర్కాట్ స్వీట్ స్టాల్ కి వెళ్లి తినాలనే ఆశ వుంది..

ఇదీ ఉపోద్ఘాతం .. దేనికీ అంటే .. అదే. ఏమిటీ ఈ మధ్య బ్లాగు లో రాయటం మానేశారు అని తెలిసిన వాళ్ళు చాలా మంది అడుగుతూనే వున్నారు .. నిజం చెప్పాలంటే నాకూ ఆశ్చర్యంగానే ఉంది.

స్నేహానికి ఇంతకు ముందు పునాదులు ఉత్తరాలు .. తరవాత emails వచ్చి ఉత్తరాలు రాయటం పూర్తిగా ఆగిపోయింది, ముఖ చిత్రం వచ్చి స్నేహపు ముఖ చిత్రమే మారిపోయింది.. లైకులు స్టేటస్ లు .. ఇదే జీవితం.. అదే సమయం లో నా లాంటి మధ్యే మార్గంలో ఉండే వాళ్ళకి బ్లాగు రాయటం అలవాటు అయ్యింది. మా స్కూల్ మిత్రులని ఒకే వేదిక పైకి తేవటంతో పాటు నా లోని రచనా తృష్ణ ని ఇది తీర్చిందనే చెప్పాలి. ఒక దశలో పొద్దుట నుండే ఆలోచన మొదలయ్యేది ఆ రోజు ఏ విషయం పై బ్లాగులో రాయాలా అని.
అలాంటి సమయంలో ఓ పెను తుఫాను whatsapp రూపం లో వచ్చింది. ఇంటర్నెట్ బ్రౌసర్ ఓపెన్ చేసి URL టైపు చేసి రాసిన ఆర్టికల్ చది వి కామెంట్ పెట్టడం ఎంత బోరో whatsapp వచ్చాకే తెలిసింది. ఇంకేముంది అందరూ అన్ని వర్గాలుగా మారి అహర్నిశలూ అన్నీ షేర్ చేసుకోవటం మొదలయ్యింది.. దాంతో బ్లాగు వ్యాపకాలు మూల పడ్డాయి ..

టెక్నాలజీలు ఎన్ని మారినా , స్థిరంగా కొన్ని నిలిచి పోయాయి.. అవే అనుబంధాలు, ఆప్యాయతలు.. and … అవును…. అపార్థాలు.. రాజకీయాలు కూడా.. ఉత్తరాలు రాసుకునే రోజుల్లో ఎన్ని ఎమోషన్స్ ఉండేవో తరవాతి దశలలో వఛ్చిన రూపాంతరాలలో కూడా అవి వున్నాయి..

మనిషి Isotope లాగా రూపాంతరం చెంద  వచ్చు గాక .. అతడి కోర్ (అదే కెమికల్ ఫార్ములా ) మాత్రం మారలేదు

 

 

 

Advertisements
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

One Response to అయినా … మనిషి మారలేదు ..

  1. kalaivani says:

    hi friends how r u all? this is kalaivani. our beloved PET sir,s prayer meeting will be held at 3rd August, 2017 at Prabha Grand Inn at 11 a.m.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s