మా మోహన చెప్పిన సైకిల్ చెయిన్ సిద్ధాంతం

ముందు ‘మోహన ఎవరు…?’ అనే కదూ మీ ప్రశ్న …?

గిరింపేట చౌక్ లో నిలబడి (2005 వరకూ) గట్టిగా ‘మోహనా…. ‘ అని అరిచారనుకోండి … ఓయ్ అంటూ కురచగా తైలపు మరకలు నిండిన ఖాకి నిక్కరు , తెల్ల బనియను, చేతిలో స్పానరుతో ఉండే ఓ పొట్టి శాల్తీ సమాధానమిస్తాడు. తను (M.K. Mohan) మాతో పాటు ఎనిమిది వరకూ చదివాడు. ముఖ్యంగా తను ఏడవ తరగతిలో రెండు సార్లు ఫెయిల్ అయ్యి మా క్లాస్ మేట్ అయినప్పుడు నాకు బాగా క్లోస్ గా ఉండేవాడు. ఆ సంవత్సరం మాతో పాటు చక్కగా చదువుకుని మంచి మార్కులతో పాస్ అయ్యాడు. కాని ఆర్ధిక పరిస్థితులు బాగోక ఎనిమిదవ తరగతి మధ్యలోనే ఆపేశాడు. తరవాత మేమంతా పుస్తకాలు చదువుకుంటే తను మాత్రం జీవితం చదవటం మొదలెట్టాడు. ఇంటి పరిస్థితులు బాగోక రెండు సైకిళ్ళ (అద్దె ) తో మొదలెట్టిన వ్యాపారం మా చదువు పూర్తయ్యే సరికి ఇళ్ళు కొనే స్థితికి చేరేంత స్థాయికి తీసుకెళ్ళాడు… పనిలో పనిగా ఇద్దరు పిల్లల తండ్రి కూడా అయ్యాడు .

చుట్టపు చూపుగా వూరికి ఎప్పుడెళ్ళినా, తన షాపుకి వెళ్ళే వాడిని. ఓ చిన్న ఐరన్ tripod మీద కూర్చే పెట్టి “రేయ్ .. రెండు పాలు తీసుకు రారా ‘ అని తన అసిస్టెంట్ కి పక్కనే వున్న టీ స్టాల్ కి ,పురమాయించేవాడు. ఎన్నేళ్ళొ చ్చినా తన పిల్లలు కాలేజి వయసుకొచ్చినా తన ఆహార్యం మాత్రం మారలేదు. అదే ఖాకి నిక్కరు … అదే తెల్ల బనీను. ‘నిన్ను ప్యాంటు షర్టులో చూడాలనుంది మోహనా ‘ అని ఆట పట్టిచ్చినా నవ్వి ఊరుకునే వాడు.

చిన్న తనం లోనే ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న తనకి, philosophical outlook తో పాటు ఏదైనా practical గా ఆలోచించే maturity అలవడింది.

సుమారు 20 ఏళ్ళ క్రితం ఓ సారి వూరెళ్ళిన సందర్భం .. ఒక రోజు బాల్య మిత్రులందరం తన షాపులో పిచ్చాపాటి మాట్లాడుతున్నాం .. ఏదో సందర్భం లో “ఏమిటో మోహనా … అన్నీ సవాళ్ళే ఎదురౌతున్నాయి … చూస్తుంటే కాలం కలిసి రావటం లేదనిపిస్తుంది .. ” అని అన్నాను. అప్పటి వరకూ సైకిల్ రిపేరు చేసుకుంటూ మా మాటలు వింటున్న మోహన్ ఒక్క సారి నా వైపు చూసి ఓ నవ్వు నవ్వాడు. ఆయిల్ లో ముంచిన సైకిల్ చైను ని చేతిలో తీసుకుని పక్కన ఓ బల్ల పై పెట్టాడు. ” చూడు రామకృష్ణా … ఈ చెయిను ఇక్కడ పెట్టి ” అరె ఈ చెయిను ఇక్కడే ఉందే ” అని బాధపడితే అది అక్కడే వుంటుందే తప్ప నువ్వు అనుకున్న చోటుకు వెళ్తుందా .. అది వెళ్ళాలంటే నువ్వే తీసి నువ్వు కోరుకున్న చోటులో పెట్టాలి . మన జీవితమూ అంతే… time బాగోలేదని విచారిస్తే సమస్య తీరదు నువ్వే పరిష్కారం ఆలోచించాలి” అని చెప్పాడు. అందరూ వంట పట్టించుకున్నారో లేదో నాకు తెలియదు కానీ నాకా క్షణం లో అర్జునుడికి గీత బోధించిన కృష్ణ భగవానుడూ , art of living ప్రవచిస్తున్న రవి శంకరూ ఒకే సారి కనపడ్డారు మా మోహనా లో . తన సైకిల్ పరిభాషలో చెప్పినా జీవన సారాన్ని ఓ చిన్న డెమోతో ఎంత బాగా చెప్పాడు అనుకున్నా.

తరవాత ఎన్నో సందర్భాలలో తన సైకిల్ చెయిన్ సిద్ధాంతం గుర్తొచ్చేది. ఎప్పుడు వూరెళ్ళినా తనని కలిసి రాకుండా వుండే వాడిని కాదు. ఓ పదేళ్ళ క్రితం వెళ్ళినపుడు ‘తను లేడు మరలి రాడు’ అని తెలిసినప్పుడు గుండెలో ఏదో మెలిక పడ్డ ఫీలింగ్.

ఇప్పటికీ గిరింపేట చౌక్ కి వెళ్తే అప్రయత్నంగా ఆ షాపు వైపు కళ్ళు మరలుతాయి .. అక్కడ ఖాకీ నిక్కరు , తెల్ల బనీను తో వుండే వుండే ఓ శాల్తీ ” రా రామకృష్ణా ..” అని చూస్తుంటాడు. Some people simply refuse to leave your memory bylanes.

Advertisements
Posted in నాటి స్మృతి సౌరభాలు | 7 Comments

పీకూ – చాలా బాగుంది

Noisy… hilarious.. and touching. ఈ మూడు పదాల్లో పీకూ చిత్ర సమీక్ష చేసెయ్యొచ్చు. చాల సన్నివేశాల్లో మనమూ పాత్రలతో కలిసిపోయి రియాక్ట్ అవుతాము ఈ చిత్రంలో.

కథ కూడా చాలా క్లుప్తంగా ఉంటుంది. మలబద్ధకం అనే obsession తో వుండే ఓ 70 ఏళ్ళ తండ్రి (అమితాబ్) , తన లాగే equally volatile temperament ఉండే ఓ కూతురు (దీపిక), వారి మధ్య నలిగిపోయే ఓ డ్రైవర్ (ఇర్ఫాన్) మధ్య నడిచే కొన్ని హాస్య సన్నివేశాల సమాహారమే ఈ చిత్రం. ఎందుకో ఈ చిత్రం చూస్తుంటే ఖరగ్పూర్ రోజులు గుర్తొచ్చాయి. ఎప్పుడైనా కోల్కత కి లోకల్ ట్రైన్స్ లో వెళుతుంటే నా సహ ప్రయాణీ కుల మధ్య సగం సంగతులు ఈ మల బద్ధకం మీదే నడిచేవి.

ఒక బెంగాలి గా , fussy and messy తండ్రిగా అమితాబ్ చాలా బాగా చేసారు. ముఖ్యంగా బెంగాలీ accent లో అమితాబ్ హిందీ మాట్లాడిన విధానం చూస్తే తనని గొప్ప నటుడు అని ఎందుకంటారో అర్థమౌతుంది. దీపిక, ఇర్ఫాన్ తమ పాత్రలకు న్యాయం చేసినా, అమితాబ్ నటనకి వారికంటే చాలా ఎక్కువ మార్కులు పడతాయి.

ఇందులో కొన్ని వైరుధ్యాలు వున్నాయి. ఎప్పుడూ తండ్రి కూతుళ్ళు గొడవ పడుతూనే వుంటారు. వారి గొడవల్లో వారు గుర్తించలేని ప్రేమని ప్రేక్షకుడు గుర్తించేలా చేయటంలో దర్శకుడు shoojit sarkar కృత కృ త్యు లయ్యారు. అందరు తండ్రుల్లాగా తమ పిల్లకి పెళ్లి చేయాలని కోరుకోడు ఇందులోని తండ్రి. Unlike many, father thinks that it is daughter’s duty to take care of him as a child and there is no point in ‘purposeless’ marriage for his daughter.
హాస్యం కూడా natural గా ఇతివృత్తం లో భాగంగా వుంటుందే కాని ఎక్కడా కృతకంగా వుండదు. ముఖ్యంగా ఇర్ఫాన్ ఖాన్ digestive system  మీద ఇచ్చే వివరణ, ఆ తరవాత అమితాబ్ కి చేసే డెమో కామెడీ లో ultimate peak . చూస్తుంటే పొట్ట చెక్కలవ్వాల్సిందే

చిత్రం చాలా బాగుంది. తప్పక చూడొచ్చు.

చిత్రం theatre లో చూస్తుంటే చివరి భాగం మిస్ అయ్యాను ఎందుకంటే నా పీకూ నుండి పిలుపొచ్చింది కాబట్టి. చివరి సన్నివేశం ఏమిటో చెప్పి కాస్త పుణ్యం కట్టుకోండి అయ్యలారా.. అమ్మలారా ..

Posted in తండ్రీ కూతుళ్ళ బంధం, సినిమాలు-సాహిత్యం | 2 Comments

చూడాలని ఎదురు చూస్తున్న చిత్రం

పీకూ – చూడాలని ఎదురు చూస్తున్న చిత్రం. మొదటి కారణం ఏమిటి అనేది నా బ్లాగ్ రెగ్యులర్ గా చదివే వాళ్ళకు , నా దగ్గరి వాళ్లకు తెలుసు. కాబట్టి రెండో కారణం నుండి చెపుతాను.

ఎందుకంటే ఇది ఇద్దరు ఎటువంటి పాత్రలలోనైనా వొదిగి పోయే matured నటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం. అమితాబ్, దీపిక తండ్రి కూతుళ్ళ పాత్రలకు సరిపోయేంతగా ఇంకెవరూ సరిపోరు. ఆకాశమంత, నాన్న, నా బంగారు తల్లి – వీటిల్లో ఏదో వెలితి కనపడేది కాస్టింగ్ లో. I think this pair is going to be the best for father – daughter combination…

వాళ్ళిద్దరూ ఈ చిత్రంలో తమ భూమికలలో జీవించి ఉంటారని చెప్పగలను . Because Amitabh is one of the best daughter’s father in real life and so is the case with deepika. So acting in their roles might have been quite spontaneous and natural. మలబద్ధకం ( 🙂 ) అనే అంశం నేపధ్యంలో చూపించే ఓ హాస్యపూరిత E ‘MOTION ‘ AL చిత్రమిది (వీడియో చూడండి).

So…. get… set… go… for May 8th

 

Posted in తండ్రీ కూతుళ్ళ బంధం | Leave a comment

మల్లి మస్తాన్ బాబు – A Tribute

సైనిక్ స్కూల్ లో స్కూలింగ్ … ఎన్ ఐ టీ లో డిగ్రీ .. ఐ ఐ టీ లో పీ జీ … ఐ ఐ ఎం లో పీ జీ డిప్లొమా … ఇంత విద్యార్హతలుంటే ఎవరైనా ఏం  చేస్తారు …? హాయిగా ఏ ఎం ఎన్ సి లోనో , లేదంటే… యూ ఎస్ లోనో స్థిరపడి గ్రీన్ కార్డు పొందేసి హాయిగా వారాంతాలు ఆస్వాదిస్తూ డాలర్ జీవితాన్ని హాయిగా గడు పుతుంటుండొచ్చు …

కాని…… అతడు

తన హృదయాన్ని అనుసరించాడు …..

తన చిన్న నాటి ఇష్టాన్ని లక్ష్యంగా మార్చుకున్నాడు …. పర్వతాలను అధిరోహించాడు … అదీ అలా ఇలా కాదు అన్ని ఖండాలలోనూ ఉన్న ఎత్తైన పర్వతాలను కేవలం 162 రోజులలో అధిరోహిస్తూ ప్రపంచ రికార్డు నెలకొల్పుతూ .. మనుషులు చూడని జయించని ప్రదేశాలను చేరుకుంటూ తన passion ని ప్రపంచానికి చాటి చెప్పాడు . అంతే కాదు తను చేరుకున్న ప్రతి పర్వతం పై జాతీయ పతాకాన్ని పాతి తన దేశ భక్తిని , భగవద్గీత గ్రంథాన్ని , రుద్రాక్షలను పెట్టి తన ఆధ్యాత్మిక , తాత్వికతను చెప్పకనే చెప్పాడు …

చిలీ లో అండీస్ పర్వతాల సముదాయంలో తొమ్మిదవ పర్వతాన్ని ప్రతికూల పరిస్థి తులనూ లెక్క చేయకుండా అధిరోహించి తిరిగి వస్తూ వాతావరణం ఉగ్ర రూపానికి తలొగ్గి …. తాను ప్రేమించిన ఆ పర్వతాల వొడిలో చివరి శ్వాస వదిలాడు . ప్రతిదీ యాంత్రికమైన ఈ రోజులలో ఇలాంటి అకుంఠి త దీక్ష కలిగిన వ్యక్తులు వున్నారంటే ఆశ్చర్యంగానూ, తన గురించి కేవలం ఒక నెల (తన గురించి పర్వతాలలో అన్వేషణ మొదలైన నాటి నుండి) నుండి మాత్రమే తెలిసినందుకు నా అజ్ఞానానికి సిగ్గుగానూ అనిపించింది.
ఇప్పటి తరం ఏదైనా నేర్చుకోవాలంటే ఇలాంటి వ్యక్తులే ఆదర్శం… ఎంత ఎదిగినా వొదిగే తత్వం , చదువుల్లోనే కాదు, తాత్వికతలోనూ, సాహసం లోనూ, ప్రాణాన్ని లెక్క చేయని తెగువ లోనూ… ఎన్నో నేర్చుకోవచ్చు.
ఖరగ్పూర్ లో తనని ఏ టెక్ మార్కెట్ లోనో, టిక్కా హోటల్ లోనో , ఆడిటోరియం లోనో, ఏ ఉగాది ఉత్సవాలలోనో …..  లేదంటే ఏ గోల్ బజారులోనో తనని అప్పట్లో  చూసే వుంటాను … ఇంతటి గొప్ప మనీషి ఆ రోజు పరిచయం అయ్యి ఉంటే ఈ జన్మ ధన్యమై వుండేది

అవును మల్లి మస్తాన్ బాబు గారి గురించే వ్యాసం … సుదూర పర్వతాలనుండి తన సొంత భూమి ఒడికి చేరుకుని ఈ రోజు నుండి శాశ్వతంగా విశ్రమించబోతున్న ఆ అలుపెరుగని యోధుడికి నివాళులర్పిస్తూ

తన గురించి మరింత ఇక్కడ  తెలుసుకోండి

 

Posted in ఫిలాసఫీ | Leave a comment

The Bridges of Madison County – పరిచయం

జీవితం అంటే ప్రతి రోజూ లేవడం , దైనందిన పనులు చేసుకోవటం , నిద్రపోయి మళ్ళీ ఇంకో రోజు కోసం ఉసూరుమంటూ ఎదురు చూడటం కాదు … నాలుగు క్షణాలైనా మనం మనంగా జీవిస్తే చాలు ఆ జ్ఞాపకాలే మిగిలిన జీవితాన్ని అర్థవంతంగా బతకటానికి సరిపోతాయి.
రోజులు గడిచిపోతుంటాయి అంతా సవ్యంగా జరిగిపోతుందనిపిస్తుంది … అలాంటి సమయం లో ఓ మలుపు ఓ పరిచయం … ఓ క్షణం ఎదురౌతుంది … కోల్పోయిందేమిటో … కోల్పోతున్నదేమి టో తెలుస్తుంది … జీవితాన్ని ఇంకో కటకం లోంచి చూపిస్తుంది ..
హృదయాన్ని అనుసరిస్తూ గమ్యం తెలియని దారులను అనుసరించాలా , రాజీ పడుతూ పొదివి పట్టుకున్న ఆ కొన్ని విలువైన క్షణాలను నెమరు వేసుకుంటూ నిస్సారమైన నిస్తేజమైన బాధ్యతల చట్రంలో ఇమిడిపోవాలా అనే మీమాంస అప్పుడే మొదలౌతుంది… సంఘర్షణ మొదలౌతుంది. That is the time you have to decide to follow your heart or mind.
ఈ ఇతివృత్తాన్ని ఆధారం గా తీసిన చిత్రమే “The Bridges of Madison County”. 1995 లో విడుదలైన ఈ చిత్రాన్ని బహుశా ఎప్పుడూ చూసి ఉండక పోయి ఉందును . మిత్రులు వసంత్ గారు ఇచ్చిన వ్యాఖ్య ఆధారం గా ఇంత మంచి చిత్రాన్ని చూడగలిగాను వారికి ధన్యవాదాలు.

చిత్రం వివరాల్లోకి వెళ్తే …
ఓ నడి వయసు మహిళ (Meryl Streep ) సాధారణ గృహిణి గా జీవితాన్ని అతి సాధారణంగా గడిపేస్తూ ఉంటుంది. తన ఇద్దరు పిల్లలు భర్త తో పాటు పని మీద వేరే వూరికి ఓ నాలుగు రోజులు వెళ్తారు. 50 సంవత్సరాల ఓ wild life photographer (Clint Eastwood ) ఈ నాలుగు రోజుల్లో పరిచయమై అత్యంత అత్మీయుడైపోతాడు. అతడి సాంగత్యంలో తాను కోల్పోయిన ఆనందాలు, అనుభూతులూ పొందుతుంది. తనని తనే discover చేస్తుందీ నాలుగు రోజుల్లో. వారి బంధం ఎంత బలపడుతుందంటే  ఏ చికాకులూ లేని తన కుటుంబ జీవితాన్ని వదులుకుని తను అతడితో వెళ్లిపోయేంతగా . తనతో వెళ్ళిపోవాలని నిర్ణయించుకుని సర్దుకుంటుంది. అప్పుడు మొదలౌతుంది సంఘర్షణ … స్వార్థం చూసుకుని తనతో వెళ్ళటమా… తన బాధ్యతలైన పిల్లలూ భర్త తో ఉండి పోవటమా … ఆ ఊగిసలాటలో తన బాధ్యతే గెలుస్తుంది. వారి నాలుగు రోజుల సాంగత్యం తనని తన కలల్లోనే ఉండిపోయేలా చేసి తన శేష జీవితం గడిపేలా చేస్తుంది … తనలోనే దాచుకున్న ఈ రహస్యాన్ని తన పిల్లలకు తెలియ జెప్పాలని, అతడితో విహరించిన Madison bridge దగ్గర తన చితా భస్మాన్ని కలిపేలా పిల్లలని కోరుతూ తను రాసుకున్న diaries పిల్లలను చదివేలా చేస్తుంది. తల్లి రహస్య జ్ఞాపకాలను చదివిన పిల్లలు ఎలా స్పందించారో చిత్రం లో మధ్య మధ్యలో చూపిస్తూ కథనం నడుస్తుంది.

చిత్రం లోని ఆత్మని ఆవిష్కరించే ఒక్క statement (Again thanking vasanth for quoting)
The old dreams were good dreams; they didn’t work out but I’m glad I had them.
Meryl Streep , Clint Eastwood రెండు పాత్రలలో జీవించారంటే అతిశయోక్తి కాదు. స్పందించే హృదయముంటే ఈ చిత్రం చూసాక హృదయాంతరాళాల లో ఓ సన్నటి జడి మొదలై ఝరై కళ్ళను సునామీలా కప్పేయగలదు. A poignant movie to feel and watch..

 

Posted in సినిమాలు-సాహిత్యం | Leave a comment

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఒకప్పుడు

గతాలు నడచిన ఈ దారులలో మళ్ళీ వెళుతుంటే
నువ్వూ ఈ దారుల వెంట వెళ్లి ఉంటావని తెలుసు
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఒకప్పుడు

ఈ గాలిలో మిళితమైన నీ పరిమళాలు నన్ను పలకరించినట్లే
నిన్నూ నిన్నలలోకి తీసుకెళ్ళి వదిలి వెళ్లి ఉంటాయని తెలుసు
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఒకప్పుడు

నిశ్చలమైన తటాకంలో నీ గుర్తుల అలలు అలజడి రేపినట్లే
నిన్నూ సుడిగుండాల లోకి లాగేసి ఉంటాయని తెలుసు
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఒకప్పుడు

చివరి మజిలీ ముగించేసి ఇక్కడే వేచి ఉన్నా
నువ్వూ నన్ను వెదుక్కుంటూ వస్తావని తెలుసు
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఒకప్పుడు

Posted in సొంత కవిత్వం | Leave a comment

COMFORT ZONE

A father/mother asks his/her kid to do homework. But the kid prefers to play rather than doing homework because he/she is comfortable to play. Parents want kid to do what they say as they believe it makes a secure future for kid so that they feel comfortable later.

A boss gives a job to his/her employee. Employee doesn’t like to do it because it doesn’t fetch any tangible benefit to him/her which makes them feel comfortable while the boss expects the work to be done because he/she can aim for next step in the ladder where he/she gets more comfort.

If you look in this perspective, the ultimate intention of every human transaction pivots around their craving for comfort. Anyone who excels or stands apart is likely to have come out of that comfort zone to achieve something.

Comfort zone though is a not a undesirable but natural tenet of our way of life, it sometimes needs a relook

Posted in ఫిలాసఫీ | 2 Comments