నిన్నటి ప్రశ్నకు సమాధానం

నిన్న రెండు పాత, కొత్త పాటల మధ్య ఉన్న సిమిలారిటి గురించి అడిగాను కదా..?
తులసి చిత్రం లో “సెలయేటి గల గలా..” అన్న పాట ఒక గాయకుడు.. కీ. శే. ఘంటసాల గారు సంగీతం కంపోస్ చేస్తే… ఇంకో గాయకుడు బాలు గారు పాడారు. అప్పట్లో అంతటి మేటి  గాయకుడు ఘంటసాల గారు, తన స్వీయ సంగీత కల్పనలో అప్పుడే వికసిస్తున్న బాలు గళానికి తను పాడకుండా అవకాశం ఇవ్వటం ఓ అపురూపమైన సందర్భం. వారి విశాల హృదయానికి తార్కాణం.


ఇకపోతే శివపుత్రుడు లోని “చిరుగాలి వీచెనే” అన్న పాటకి ఒక సంగీత దర్శకుడు – ఇళయరాజా గారు కంపోజ్ చేస్తే.. ఇంకో సంగీత దర్శకుడు ఆర్. పీ. పట్నాయక్ పాడారు. ఈ పాట తమిళం లో విని ముగ్ధుడై , ఈ పాట ని తెలుగు లో తాను పాడతానని ఇళయరాజా గారిని కోరి మరీ పట్నాయక్ గారు పాడారని ఎక్కడో చదివాను. ఒకే కోవకు చెందినా ఇద్దరు ఒకరికొకరు అవకాశం ఇవ్వటం కూడా అపురూపమైన సంఘటన.


అలా ఈ రెండు పాటల్లోనూ ఒక చిత్రమైన సారూప్యత ఉంది. ఒక రంగం లో పేరున్నా .. ఇంకో రంగంలో కూడా తాము రాణించ గలము …   అని  చెప్పటానికి ఈ రెండు పాటలు ప్రతీకలు.

This entry was posted in పాటలు. Bookmark the permalink.

1 Response to నిన్నటి ప్రశ్నకు సమాధానం

  1. sugunasri says:

    Very good observation and very nice songs!

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.